: ఢిల్లీలో గడ్కరీతో మ‌ంత్రి తుమ్మ‌ల భేటీ.. డిసెంబ‌రు నాటికి ర‌హ‌దారుల‌కు అనుమ‌తి ఇస్తామని గడ్కరీ హామీ


ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీతో తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోర‌గా గ‌తంలో కేంద్రం 1951 కిలోమీట‌ర్ల జాతీయ‌ర‌హ‌దారులు ప్ర‌క‌టించిందని, వాటికి సంబంధించిన ప్ర‌ధాన రోడ్ల‌ డీపీఆర్‌ని కేంద్ర‌మంత్రికి అందించామ‌ని చెప్పారు. రాష్ట్రం ప్ర‌తిపాదించిన ర‌హ‌దారుల‌కు అనుమ‌తి ఇవ్వ‌మ‌ని కోరిన‌ట్లు చెప్పారు. దీనిపై గ‌డ్క‌రీ సానుకూలంగా స్పందించార‌ని, ప‌రిశీలించి డిసెంబ‌రు నాటికి అనుమ‌తులు ఇస్తామ‌ని చెప్పార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News