: నా భార్యకు లావణ్య త్రిపాఠి నచ్చడానికి కారణమదే కావచ్చు!: హీరో అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ సోదరుడు, యువహీరో అల్లు శిరీష్ నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ కు అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడు. ‘సాధారణంగా నా భార్య స్నేహకు ఏ హీరోయిన్ నచ్చదు. కానీ, శ్రీరస్తు శుభమస్తు చిత్రంలోని హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మాత్రం బాగా ఇష్టపడింది. దీనికి కారణం, లావణ్య నాతో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు, అందుకే, నా భార్య ఆమెను ఇష్టపడి ఉండొచ్చు’ అంటూ స్టైలిష్ స్టార్ చమత్కరించాడు. దాంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వేశారు.

  • Loading...

More Telugu News