: జగ్గారెడ్డి అరెస్ట్‌పై రాజనర్సింహ ఆగ్రహం
భూనిర్వాసితులకు మద్దతుగా దీక్షకు దిగిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగ్గారెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో దోపిడీ జరుగుతోందని, దానికి మాత్రమే తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోన్న 123 జీవోను పూర్తిగా రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని ఆయన తెలిపారు.