: దళితులపై దాడి అంశంలో స్పందించిన కమలానందభారతి
ఉత్తరభారతంలోనే కాక ఆంధ్రప్రదేశ్లోనూ చోటుచేసుకున్న దళితులపై దాడులు అంశంలో హిందూ ధర్మ ప్రచారకులు కమలానందభారతి ఈరోజు స్పందించారు. ఆవు చర్మం ఒలుస్తున్నారంటూ ఇద్దరు దళిత అన్నదమ్ములపై అమలాపురంలో తాజాగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన ఈరోజు మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఆ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మాదిగ సోదరులు చేసే సమాజ సేవను గుర్తించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో జరుగుతున్న దొంగతనాలపై స్పందిస్తూ వాటిని అరికట్టాలని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావును కోరారు.