: బాలయ్య వందో సినిమా నేను చేయడం నా అదృష్టం: తిరుమలలో దర్శకుడు క్రిష్
ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్), ఆయన సతీమణి రమ్య ఈరోజు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం క్రిష్ మీడియాతో మాట్లాడారు. తాను రమ్యను వివాహమాడిన సందర్భంగా స్వామి వారి దర్శనం చేసుకున్నానని పేర్కొన్నారు. నటుడు నందమూరి బాలకృష్ణతో వందో సినిమా చేయడం తన అదృష్టమని అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి జీవితంలోని అంశాలను అద్భుతంగా తెరకెక్కిస్తున్నామని ఆయన అన్నారు. షూటింగ్ చకచకా జరిగిపోతోందని పేర్కొన్నారు.