: ఫొటోగ్రాఫర్లను చెంప పగలగొడతానన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ!


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ మరోసారి నోరుపారేసుకున్నారు. ఫొటోగ్రాఫర్లను చెంప పగలకొడతానని ఆమె హెచ్చరించారు. ముఖ్యమంత్రిని తమ కెమెరాలలో బంధించాలని ఆతృత పడుతూ, ముందుకు దూసుకు వచ్చిన ఫొటోగ్రాఫర్లపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ నోరుజారారు. "ఏం ... కనపడడం లేదా... చెంప పగలకొడతా ... మీకసలు మేనర్స్ తెలియవు" అంటూ దీదీ రుసరుసలాడారు. దాంతో నివ్వెరపోవడం జర్నలిస్టుల వంతయింది.

పశ్చిమ బెంగాల్ లోని బుర్దాన్ జిల్లాలో జరుగుతున్న 'మాటీ ఉత్సవ్' లో ఆదివారం ముఖ్యమంత్రి పాల్గొన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కూడా ఆమె దుర్భాషలాడిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యమంత్రి మమతా తీరును పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. 

  • Loading...

More Telugu News