: ప్రాణం పోయినా దీక్ష చేస్తాను... భీష్మించుకుని కూర్చున్న జగ్గారెడ్డి


మల్లన్న సాగర్ బాధితులకు మద్దతుగా తన ప్రాణం పోయినా దీక్ష నిర్వహించే తీరుతానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. ఈ ప్రాంతంలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున దీక్షకు అనుమతించే పరిస్థితులు లేవని పోలీసులు స్పష్టం చేయగా, జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేసేవరకూ తన పోరాటం సాగుతోందని అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం మల్లన్న సాగర్ నుంచే బీజం పడిందని తెలిపారు. కాసేపట్లో దీక్షను ప్రారంభిస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని తెలిపారు. జగ్గారెడ్డి దీక్షను అడ్డుకునేందుకు సంగారెడ్డిలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News