: జైట్లీ లైవ్ ప్రసంగాన్ని చూసి చంద్రబాబు ఫైర్!... చేతిలోని పేపర్లను గిరాటేసిన వైనం!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగం... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును ఆగ్రహావేశాలకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే నాడు తన క్యాంపు కార్యాలయంలో కూర్చుని పనులన్నీ పక్కనబెట్టి జైట్లీ ప్రసంగం వింటున్న చంద్రబాబు ఏ విధంగా స్పందించారన్న విషయం తాజాగా వెలుగు చూసింది. అప్పటిదాకా సమీక్షలతో బిజీబిజీగా ఉన్న సీఎం జైట్లీ ప్రసంగానికి కాస్తంత ముందుగా అందరినీ బయటకు పంపేసి టీవీని చూడటం ప్రారంభించారు. ఆ సమయంలో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రమే చంద్రబాబు వద్ద ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ తేల్చి చెప్పగానే చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. చేతిలోని పేపర్లను టేబుల్ పైకి గిరాటేశారు. ఇంత దారుణమా? అంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్రను పిలవమని ఆదేశించారు. ‘‘కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చేద్దాం. సతీశ్ చంద్ర ఎక్కడున్నారు? ఎక్కడున్నా పిలవండి. లెటర్ ప్రిపేర్ చేయమనండి’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో షాక్ తిన్న అచ్చెన్న ఆయనను శాంతింపజేసేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ఇక తప్పదనుకున్న యనమల కల్పించుకుని ‘తొందరొద్దు సార్’ అని చెప్పడంతో పాటు తదుపరి పరిణామాలను వివరించడంతో చంద్రబాబు కాస్తంత శాంతించారట.

  • Loading...

More Telugu News