: నయీమ్ దోస్తుల చిట్టా చాలా పెద్దదే!... జాబితాలో 15 మంది ఐపీఎస్ లు!


తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ దోస్తుల చిట్టా చాలా పెద్దదేనట. పాలమూరు జిల్లా షాద్ నగర్ లో మొన్న ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నయీమ్ చనిపోయిన సంగతి తెలిసిందే. నయీమ్ హతం కాగానే అతడి కార్యకలాపాల గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతడికి చెందినట్లుగా భావిస్తున్న ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీని ఓపెన్ చేసిన పోలీసులు అందులో నయీమ్ దోస్తుల జాబితాను చూసి షాక్ తిన్నారు. ఈ జాబితాలో ఏకంగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులున్నారని పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ 15 ఐపీఎస్ అధికారుల్లో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల కేడర్ ఐపీఎస్ అధికారులున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News