: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద!... 125 టీఎంసీలకు పైగా చేరిన నీరు!
కృష్ణా నదిపై కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపాన నిర్మించిన శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని రోజులుగా జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో జలాశయంలో నీటి నిల్వ అంతకంతకూ పెరుగుతోంది. నేటి ఉదయం 7 గంటల సమయానికి జలాశయంలో నీటి నిల్వ 125.43 టీఎంసీలకు చేరింది. వెరసి జలాశయంలో 865.8 అడుగులకు నీరు చేరుకుంది. ఇప్పటికీ జలాశయంలోకి 1,79,422 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 20,483 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు.