: ‘రియో’ అప్ డేట్స్.. అర్జెంటీనాపై భారత్ పురుషుల హాకీ జట్టు విజయం
రియో ఒలింపిక్స్ లో అర్జెంటీనాపై భారత్ పురుషుల హాకీ జట్టు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లింది. అర్జెంటీనా జట్టుపై 2-1 తేడాతో భారత్ నెగ్గింది. మన ఆటగాళ్లు చింగ్లెన్సన, కొతజిత్ లు ఒక్కో గోల్ చేశారు. అర్జెంటీనా జట్టు ఆటగాడు గొంజలో ఒక గోల్ చేశాడు. మొత్తం 3 మ్యాచ్ లు ఆడిన భారత్ రెండు మ్యాచ్ లలో నెగ్గడంతో 6 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ నెల 11న హాలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ తలపడనుంది.