: నయీమ్ కేసుల విచారణకు సిట్ ఏర్పాటు


గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించిన కేసుల విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నయీమ్ పై నమోదై ఉన్న పలు కేసులను సిట్ కు బదిలీ చేసింది. కేసులతో పాటు అక్రమాస్తుల వ్యవహారంపై కూడా సిట్ లోతుగా దర్యాప్తు చేయనుంది. అయితే, దర్యాప్తు బృందంలో ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు కొనసాగుతోంది. సిట్ వివరాలను రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. నయీమ్ పై నమోదైన పలు కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో దర్యాప్తు చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని భావించిన డీజీపీ అనురాగ్ శర్మ సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News