: పుష్కరాల విధులకు హైదరాబాద్ నుంచి వచ్చిన 600 మంది హోంగార్డుల ఆందోళన
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసు శిక్షణ కేంద్ర వద్ద ఈరోజు హోం గార్డులు ఆందోళనకు దిగారు. పుష్కరాల విధులను నిర్వర్తించడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన 600 మంది హోంగార్డులు తమకు కనీస వసతులు కూడా కల్పించలేదని ఆరోపిస్తున్నారు. తాము పుష్కరాల విధులు నిర్వహించలేమని నిరసన చేపట్టారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌కి వెనుదిరిగే ప్రయత్నం చేశారు. దీంతో హోంగార్డులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.