: నేత్ర దానం చేస్తా: హీరోయిన్ రెజీనా
చూపు లేని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేత్ర దానం చేస్తానని ప్రముఖ హీరోయిన్ రెజీనా చెప్పింది. నెల్లూరులో ఏర్పాటు చేసిన ఒక కంటి ఆసుపత్రిని ఆమె ప్రారంభించింది. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నేత్ర దానం చేయాలని, అందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా తన నేత్ర దానానికి సంబంధించిన పత్రాలపై ఆమె సంతకాలు చేసింది. రెజీనాను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్, శ్రీధర్ రెడ్డి, నెల్లూరు మేయర్ అజీజ్ పాల్గొన్నారు.