: ఫైనల్ కి చేరడం చాలా ఆనందాన్నిచ్చింది: జిమ్నాస్ట్ దీపా కర్మాకర్


రియో ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని భారత జిమ్నాస్ట్ దీప కర్మాకర్ చెప్పింది. తన మొదటి ప్రయత్నంలోనే కఠినమైన ప్రొడునోవా విన్యాసంతో అభిమానులని మెప్పించిన ఆమె 8వ స్థానంలో నిలిచి వాల్ట్ విభాగంలో ఫైనల్ పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అనంతరం దీప కర్మాకర్ మీడియాతో మాట్లాడుతూ, క్వాలిఫైయింగ్ ముందు మాత్రమే ఒత్తిడి ఉండేదని, ప్రస్తుతం లేదని, ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పింది. ఫైనల్ చేరిన జిమ్నాస్ట్ ల జాబితా ప్రకటన కోసం చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చిందని, ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని ఈరోజు తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న దీప కర్మాకర్ పేర్కొంది. కాగా, ఈ నెల 14న వాల్ట్ ఫైనల్ పోరు జరగనుంది. ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా దీప కర్మాకర్ చరిత్ర సృష్టించింది.

  • Loading...

More Telugu News