: సెల్ఫీలు, ఉత్త చేతులే... రియోకు మనీ వేస్ట్: శోభా డే వివాదాస్పద వ్యాఖ్య
భారత క్రీడాభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా రియోలో విఫలమవుతుండటంపై ప్రముఖ కాలమిస్ట్, నవలా రచయిత్రి శోభా డే తన ట్విట్టర్ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు. "ఒలింపిక్స్ కు వెళ్లిన భారత జట్టు లక్ష్యమొక్కటే. రియోకు వెళ్లడం, సెల్ఫీలు దిగడం, ఉత్త చేతులతో వెనక్కు రావడం. వారికిచ్చిన అవకాశం, వెచ్చించిన డబ్బూ వృథా" అని అన్నారు. ఆటగాళ్లను నిరుత్సాహపరిచే ఈ తరహా వ్యాఖ్యలు కూడదంటూ, శోభా ట్వీట్ పై నెటిజన్లు మండిపతుతున్నారు. క్షమాపణకు డిమాండ్ చేశారు. అయితే, తాను చేసిన ట్వీట్ ఎంత మాత్రమూ తప్పుకాదని, క్షమాపణ కోరేది లేదని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. కాగా, గతంలో ఒలింపిక్స్ పతకాలు గెలిచి, రియోకు వెళ్లిన భారత పేరున్న ఆటగాళ్లలో లియాండర్ పేస్, గగన్ నారంగ్, అభినవ్ బింద్రాలు ఇప్పటికే వెనుదిరగగా, సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో పేలవమైన ఆటతీరుతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.