: ఒలింపిక్స్ 'వాల్ట్స్' ఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ ను 'హౌస్ అరెస్ట్'లో ఉంచిన కోచ్!


భారత జిమ్నాస్ట్, 'వాల్ట్స్' విభాగంలో ఫైనల్స్ కు అర్హత సాధించిన తొలి ఇండియన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ ప్రస్తుతం హౌస్ అరెస్ట్ లో ఉంది. మంగళవారం నాడు ఆమె పుట్టిన రోజు కాగా, తల్లిదండ్రులు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడం మినహా మరే మిత్రుల నుంచి ఫోన్ కాల్స్ అందుకునేందుకు ఆమెకు అనుమతి లభించలేదు. ఇండియాకు దాదాపు 35 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె, ఆగస్టు 14న వాల్స్ ఫైనల్స్ లో పతకం కోసం పోటీ పడనున్న సంగతి తెలిసిందే. ఆమెపై ఫైనల్స్ ఒత్తిడి పడకూడదన్న ఉద్దేశంతోనే ఎవరితోనూ కలవనీయకుండా చేసినట్టు దీపా కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. "నేను ఆమె మొబైల్ ఫోన్ లో సిమ్ కార్డును తీసివేశాను. కేవలం తల్లిదండ్రులతో మాట్లాడేందుకు మాత్రమే అనుమతించాను. తన గమ్యాన్ని ఆమె మరచిపోరాదన్నదే నా ఉద్దేశం" అని నంది వ్యాఖ్యానించింది. ఆమెతో పాటు గదిలో ఏకైక భారత మహిళా వెయిట్ లిఫ్టర్ శిఖోమ్ మీరాభాయ్ చానూ ఉందని తెలిపారు. కాగా, ప్రిలిమ్స్ లో అత్యంత క్లిష్టమైన 'ప్రొడునోవా వాల్ట్'ను ప్రదర్శించిన ఆమెపై ఇప్పుడు భారత క్రీడాభిమానులు పతకం కోసం ఎన్నో ఆశలు పెట్టుకోగా, జిమ్నాస్టిక్స్ ప్రపంచం సైతం ఆసక్తిగా చూస్తోంది.

  • Loading...

More Telugu News