: తెలంగాణ ముస్లింలు అవయవ దానానికి దూరం.. మూడేళ్లలో ఒక్కరూ ముందుకు రాని వైనం


గతంతో పోలిస్తే ప్రజల్లో అవయవదానంపై అవగాహన బాగా పెరిగింది. బ్రెయిన్‌డెడ్ అయిన తమవారి అవయవాలను దానం చేసేందుకు పలువురు ముందుకొస్తూ మరెంతోమందికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ నుంచి ఒక్క ముస్లిం కూడా అవయవ దానానికి ముందుకు రాకపోవడం గమనార్హం. వారిలో అవగాహన పెంచేందుకు జీవన్‌దాన్ బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 2013-2016 మధ్య 241 మంది బ్రెయిన్ డెడ్‌కు గురికాగా వారి అవయవాలను వెయ్యిమందికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు. అవయవదానం అందుకున్న వారిలో 39 మంది ముస్లింలు కూడా ఉన్నారు. అయితే ఆ కమ్యూనిటీ నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా అవయవ దానానికి ముందుకు రాలేదని జీవన్‌దాన్ బృందం పేర్కొంది. అవయవదానంపై ముస్లింలలో అవగాహన పెంచేందుకు ఆ కమ్యూనిటీ నుంచే ఓ అంబాసిడర్‌ను ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.స్వర్ణలత పేర్కొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హెచ్ మిరాజ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. అవయవ దానం విషయంలో మతం నుంచి అభ్యంతరాలు ఉండడమే ఇందుకు కారణమని అపోలో ఆస్పత్రి ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ ఈశ్వర్ పేర్కొన్నారు. అయితే త్వరలోనే ఈ విషయంలో వారిలో మార్పు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News