: నయీమ్ వాడిన కారు కూకట్ పల్లికి చెందిన రాజకీయ నేతదట!
తెలంగాణ పోలీసుల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ఎట్టకేలకు నిన్న హతమైపోయాడు. గ్రేహౌండ్స్ బలగాలు చేసిన మెరుపు దాడిలో తప్పించుకునేందుకు నయీమ్ యత్నాలు ఫలించలేదు. కారులో ఉండగానే ఏకే-47 చేతబట్టి పోలీసులపైకి తిరగబడ్డ నయీమ్... తప్పించుకునేందుకు చివరి దాకా యత్నించాడు. అయితే అప్పటికే అతడి ఆగడాలపై వెల్లువెత్తిన ఫిర్యాదుతో పోలీసులు అతడి వాహనంపై మూకుమ్మడిగా కాల్పులకు దిగారు. ఈ క్రమంలో అతడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాదు నుంచి షాద్ నగర్ వచ్చేందుకు నిన్న అతడు వాడిన ఫోర్డ్ ఎండీవర్ (ఏపీ 28 డీఆర్ 5859) కారు ఎవరిదనే విషయంపై ఆరా తీసిన పోలీసులు నోరెళ్లబెట్టారట. ఈ కారు హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన ఓ బడా రాజకీయనేతకు చెందినదిగా విచారణలో తేలినట్లు సమాచారం.