: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 200 మంది పోలీసులతో ముమ్మరంగా తనిఖీలు
స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఉగ్రచర్యలు, అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా చూడడానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో 200 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే డీఎస్పీ గోవర్ధన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. తనఖీల్లో భాగంగా అనుమానితులని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.