: మూడు నెలలుగా నయీం మకాం అల్కాపురి కాలనీలోనే!


హైదరాబాద్ అల్కాపురికాలనీలోని తన నివాసంలోనే గ్యాంగ్ స్టర్ నయీం మూడు నెలలుగా నివాసమున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఇల్లు నయీం భార్య సాజిదాషహీన్ పేరుతో ఉన్నట్లు సమాచారం. ఈ కాలనీలోని కారు పార్కింగ్ స్థలాన్ని నయీం కబ్జా చేశాడని, ఈ నేపథ్యంలో సంబంధిత గ్రామ పంచాయతీ నోటీసులు కూడా ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నయీం ఇంట్లో 20 జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, భారీగా నగదు, నగలు, పలు కీలక పత్రాలు, ఆడీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News