: త్వరలో పరిష్కారం చూపుతాం: ఏపీకి హోదాపై మేకపాటి ప్రశ్నకు లోక్ సభలో జైట్లీ సమాధానం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో త్వరలోనే పరిష్కారం చూపిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో వెల్లడించారు. వైకాపా ఎంపీ మేకపాటి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. కొంత సంయమనాన్ని పాటించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేసిన మేకపాటి, గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.