: ఎన్ కౌంటర్ కు కొన్ని గంటల ముందు అనుచరుడిని పొట్టనబెట్టుకున్న నయీమ్!


తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా మారిన నయీమ్... గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో ప్రాణాలు వదలడానికి కొన్ని గంటల ముందు ఓ దారుణానికి పాల్పడ్డాడు. తనను నమ్ముకుని తన అనుచరుడిగా ఉన్న వాజిద్ అనే యువకుడిని అతడు పొట్టనబెట్టుకున్నాడు. నిన్న రాత్రి షాద్ నగర్ కు వచ్చే ముందు జరిగిన ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ లో చోటుచేసుకుంది. జహీరాబాద్ లో అనుచరుడు వాజిద్ ను చంపేసిన నయీమ్ అక్కడి నుంచి పరారై నేరుగా షాద్ నగర్ కు వచ్చినట్లు సమాచారం. జహీరాబాద్ నుంచి షాద్ నగర్ వచ్చిన అతడి వెంట ఓ మహిళ, మరో ఇద్దరు అనుచరులున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News