: అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మొదలు... తొలి రోజు ఆఫర్లు


ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏటా ప్రకటించే 'గ్రేట్ ఇండియన్ సేల్' నేడు మొదలైంది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ అమ్మకాల్లో పలు ప్రొడక్టులపై భారీ డిస్కౌంటులను అందిస్తామని తెలిపింది. వెబ్ సైట్ ప్రైమ్ సభ్యులకు మరిన్ని రాయితీలు ప్రకటించింది. రూ. 499తో సంవత్సరం సభ్యత్వం తీసుకున్న వారికి కనీస ఆర్డర్ మొత్తంపై పరిమితి ఉండదని తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ అప్లయెన్సెస్, దుస్తులు, షూలకు చెందిన పాప్యులర్ బ్రాండ్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ప్రకటించింది. మొత్తం 30 నుంచి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అమెజాన్ యాప్ ను వాడితే 10 శాతం రాయితీ కూడా లభిస్తుంది. ఆన్‌ లైన్‌ లో బుక్ చేస్తే 7.5 శాతం డిస్కౌంట్ లభిస్తుందని, ఇందుకోసం రూ. 5 వేలకు పైగా కొనుగోలు చేయాలని, గరిష్ఠంగా రూ. 2 వేల డిస్కౌంట్ ను పొందవచ్చని ప్రకటించింది. జియోమీ ఎం5పై రూ. 2 వేల ఫ్లాట్ డిస్కౌంట్, ఓబీఐ వరల్డ్ ఫోన్ ఎస్ఎఫ్1ను రూ. 7,999కి అందిస్తున్నట్టు ప్రకటించింది. శాంసంగ్ ఆన్7 ప్రోపై 9 శాతం రాయితీతో రూ. 10,190కి ఇస్తున్నట్టు తెలిపింది. డ్యానియల్ క్లెయిన్ మహిళల వాచ్ ను రూ1099కి (అసలు ధర రూ. 2350), ఫిలిప్స్ రూ.999 ఎంఆర్పీ హెడ్ ఫోన్ ను రూ. 599 లకే, ఇస్తామని పేర్కొంది. వీటితో పాటు లాగిటెక్ యూఈ బూమ్, టీవీ 2, సౌండ్ మ్యాజిక్ ఈఎస్ 19ఎస్, జాబోన్ యాక్టివ్ ట్రాకర్స్, లైటెనింగ్ కేబుల్స్, శాన్యో ఐపీఎస్ టీవీ తదితరాలపై భారీ డిస్కౌంట్లను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. వీటితో పాటుగా మహిళల కోసం వెరా మోడా బ్రాండ్ దుస్తులపై 60 శాతం తగ్గింపు, ప్యూమా షూ రేంజ్ పై 50 వరకూ తగ్గింపు ఆఫర్ ను ప్రకటించినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News