: టీడీపీకి దన్నుగా గద్దె బాబురావు!... విజయనగరంలో పార్టీ కార్యాలయానికి రూ.10 లక్షల విరాళం!
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వ విప్ గా పనిచేసిన గద్దె బాబురావు... పార్టీకి ఆర్థిక విషయాల్లో దన్నుగా నిలుస్తున్నారు. నిన్న విజయనగరంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. విజయనగరంలో నిర్మించతలపెట్టిన పార్టీ జిల్లా కార్యాలయానికి గద్దె బాబురావు రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 35 ఏళ్లకు పైగా ప్రస్థానం కొనసాగిస్తున్న టీడీపీకి ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో సరైన కార్యాలయాలే లేవు. ఈ క్రమంలో వరుసగా ఆయా జిల్లాల కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పార్టీ కాస్తంత నిదానంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయానికి గద్దె బాబురావు తనవంతుగా రూ.10 లక్షల విరాళం ప్రకటించి పార్టీకి ఆర్థిక విషయాల్లో కాస్తంత అండగా నిలిచారు.