: షాద్ నగర్ లో ఉగ్రవాదులు... రంగంలోకి దిగిన పోలీసులు


హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓ భవంతిలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం రావడంతో, భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి సోదాలు జరుపుతున్నారు. పోలీసుల విస్తృత తనిఖీలతో, ఈ ప్రాంతంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడి మిలీనియం టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, బాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టు పక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. ఈ విషయంలో మరింత సమాచారం వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News