: రూ. 10 కోట్లు ఖర్చు పెడితే, 'ఆవు' కథ చెప్పి వెళ్లిన మోదీ: కాంగ్రెస్ ఎద్దేవా


తెలంగాణకు తొలిసారిగా వచ్చిన భారత ప్రధానికి ఘన స్వాగతం పలికి, రూ. 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టి బహిరంగ సభ ఏర్పాటు చేస్తే, ఒక్క కొత్త పథకం కూడా ఇవ్వకుండా, చివర్లో ఆవు కథ చెప్పి వెళ్లిపోయారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటిస్తారని అనుకుంటే, ఆ మాట కూడా ఆయన నోటి నుంచి రాలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఒక్క కచ్చితమైన హామీ కూడా ఇవ్వకుండా ప్రజలను తీవ్ర నిరాశలో ముంచెత్తారని దుయ్యబట్టారు. ప్రధాని రాకతో రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరగలేదని, కేసీఆర్, మోదీలు ఒకరిని ఒకరు పొగడుకోవడానికే ఈ పర్యటన జరిగినట్టుందని అన్నారు.

  • Loading...

More Telugu News