: ఈసారి చర్లపల్లి జైలు వంతు!... వార్డర్లకు మస్కా కొట్టి జీవిత ఖైదీ పరారు!


ఏపీలోని కడప, అనంతపురం జిల్లాల్లోని జైలుల నుంచి పలు సందర్భాల్లో ఖైదీలు పరారైన ఘటనలు ఆ రాష్ట్రంలోని పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. తాజాగా నిన్న రాత్రి హైదరాబాదులోని చర్లపల్లి జైలులోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గోవర్ధన్ అనే వ్యక్తి జైలు వార్డర్లకు మస్కా కొట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. గోవర్ధన్ పరారైన విషయాన్ని రాత్రే పసిగట్టిన జైలు అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే నేటి ఉదయం ఈ విషయం ఎట్టకేలకు మీడియాకు చేరిపోయింది. దీంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది.

  • Loading...

More Telugu News