: హైదరాబాదు- గుల్బర్గా జర్నీ ఇక సౌఖ్యమే!... తెలంగాణలో నేడు పట్టాలెక్కనున్న రెండు కొత్త రైళ్లు!


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచి తెలంగాణ సరిహద్దులోని కర్ణాటక నగరం గుల్బర్గాకు వెళ్లాలంటే నానా పాట్లు పడాల్సిందే. హైదరాబాదు నగరం నుంచి ఆ నగరానికి వెళ్లే బస్సులన్నీ నిత్యం రద్దీతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై హైదరాబాదు నుంచి గుల్బర్గా వెళ్లే ప్రయాణం కాస్తంత సౌకర్యవంతంగా మారనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ తెలంగాణలో రెండు కొత్త రైళ్లను ప్రారంభించనుంది. వీటిలో హైదరాబాదు- గుల్బర్గా మధ్య ఓ రైలు, ముంబై- ఖాజీపేట మధ్య మరో రైలు ఉన్నాయి. వీటిని నేడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News