: నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు!... మందడి సాగర్ రెడ్డిపై సొంత పార్టీ నేతల దాడి!
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఈ విభేదాలు ఆ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య పరస్పర ఆరోపణలకు మాత్రమే పరిమితం కాలేదు. ఓ వర్గం నేతపై మరో వర్గం ఏకంగా భౌతిక దాడికి దిగింది. ఈ దాడిలో నలుగురు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా జిల్లా పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. వివరాల్లోకెళితే... నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత మందడి సాగర్ రెడ్డిపై ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అదే పార్టీకి చెందిన మరో వర్గం నేతలు దాడికి దిగారు. నిన్న రాత్రి జరిగిన ఈ దాడిలో సాగర్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోగా, ఆయన అనుచరవర్గంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన హైదరాబాదులోని కామినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి పరుగులు పెట్టారు. ఏకంగా జిల్లా ఎస్పీ స్వయంగా ఇంద్రపాలనగరానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు.