: మోదీని హైదరాబాద్‌లో అడుగుపెట్ట‌నివ్వ‌బోమ‌ని అప్ప‌ట్లో కొందరన్నారు!: కిష‌న్‌రెడ్డి చురకలు


ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ నిర్వ‌హిస్తోన్న‌ మ‌హా స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ తెలంగాణ నేత, ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ‘కొంద‌రు అప్ప‌ట్లో అన్నారు.. మోదీని హైదరాబాద్‌లో అడుగుపెట్ట‌నివ్వ‌బోమ‌ని.. కానీ, ఇప్పుడు మోదీ 125 కోట్ల భారతీయుల మ‌న‌సులు గెలుచుకొని హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు. పులిబిడ్డ‌గా, ఆయ‌న ఈరోజు హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈరోజు ఎంతో మంచిరోజ‌ని, తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ స‌హాయ‌ స‌హ‌కారాలందిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. మ‌రికాసేప‌ట్లో మోదీ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

  • Loading...

More Telugu News