: సోషల్ మీడియాలో స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపండి: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ


సోష‌ల్ మీడియాలో మంత్రులు, ప్ర‌భుత్వాధికారులు స్వేచ్ఛ‌గా త‌మ అభిప్రాయాల‌ను పేర్కొనాల‌ని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ‘మైగవ్’ యాప్ రెండో వార్షికోత్సవ కార్యక్రమం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వం పారదర్శకంగా పని చేసేందుకు మంత్రులు, అధికారులు సోష‌ల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల‌ని సూచించారు. వారు అభిప్రాయాలను పేర్కొన‌డంలో తప్పులేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యాల్లో అందరూ ఒకే తాటిపై నిలబడి ఉండ‌డానికి, ఒకే నిర్ణయాన్ని తెలపాలని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సోష‌ల్‌మీడియాతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని జైట్లీ అన్నారు. ప్ర‌భుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని గురించి అన్ని వ‌ర్గాల నుంచి ప‌లు విమర్శలు, అభిప్రాయాలు, సూచనలు రావ‌డం ప‌రిపాటేన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News