: విమర్శలు ఆపి నిజం తెలుసుకోండి: సానియా మీర్జా
కేవలం శక్తి మేరకు ఆట చూపగలమే గానీ, గెలుస్తామా? ఓడిపోతామా? అన్న విషయాన్ని ఎవరూ చెప్పలేరని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. ప్రార్థనతో కలసి మహిళల డబుల్స్ విభాగంలో ఆడిన సానియా, తొలి రౌండులోనే తీవ్ర నిరాశకు గురిచేస్తూ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ, గెలుపు, ఓటములు ఆటలో భాగమేనని, తనను విమర్శించడం మాని, ఈ విషయమై నిజాన్ని తెలుసుకోవాలని సూచించింది. తన నుంచి భారత్ ఏం ఆశిస్తోందో తెలుసునని, పతకం తీసుకువచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయని తెలిపింది. మిక్సెడ్ డబుల్స్ లో బోపన్నతో కలసి ఆడుతున్నానని గుర్తు చేసిన సానియా, పతకం పడతానన్న ధీమా వ్యక్తం చేసింది. ఇండియాకు పతకం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానన్న ఒక్క విషయాన్ని అభిమానులు ఎన్నడూ మరవరాదని కోరింది.