: చంద్రబాబు ఆగ్రహించిన వేళ వివరణ ఇచ్చుకున్న సుజనా చౌదరి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరమూ కేంద్రంతో పోరాడుతున్న తాను, కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లును లోక్ సభకు పంపాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చిన వేళ బల్లలు చరుస్తూ మద్దతు పలికినట్టు వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఖండించారు. కురియన్ రూలింగ్ ఇస్తున్న సమయంలో సుజనా బల్లలు చరచడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుజనా తన టేబుల్ పై చరుస్తున్న దృశ్యాలు కూడా టీవీల్లో కనిపించాయి. ఆయన వైఖరిని సీఎం సైతం తప్పుబట్టగా, సుజనా వివరణ ఇచ్చారు. తనకు బల్లలు కొట్టాల్సిన అవసరం లేదని, తాను ఆ పని చేయలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని చెప్పారు. ప్రజల కోరికను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకువెళుతున్నానని చెప్పారు.