: రాజమహేంద్రవరంలో వెల్లువెత్తిన పుష్కర జనం


గోదావరి అంత్య పుష్కరాలు ఎనిమిదవ రోజుకు చేరిన వేళ, సెలవు దినం కావడంతో రాజమహేంద్రవరం గోష్పాద క్షేత్రం, కోటి లింగాల రేవు, సరస్వతీ ఘాట్, పుష్కర ఘాట్ ల వద్ద భక్త జనం వెల్లువెత్తారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపిస్తోంది. పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి ఘాట్ లో భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం నిన్నటితో పోలిస్తే ఒక అడుగు మేరకు పెరిగింది. ప్రస్తుతం 10.9 అడుగుల నదీ ప్రవాహం ఉంది. దీంతో ప్రమాదాలు జరుగకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. భక్తుల పుణ్య స్నానాలు చేసే నది పరిధిని తగ్గించారు. మరోవైపు భద్రాచలం వద్ద ప్రధాన ఘాట్ లోని సీతారామచంద్ర స్వామి ఆలయం మెట్ల వరకూ నది నీరు చేరింది. ఈ ఉదయం 37 అడుగుల ప్రవాహం నమోదైంది. తాలిపేరు ప్రాజెక్టు పూర్తిగా నిండి, అన్ని గేట్లనూ ఎత్తివేయడంతోనే ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News