: బ్రెజిల్లో సందడి చేస్తున్న సచిన్ టెండూల్కర్
రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత జట్టు గుడ్ విల్ అంబాసిడర్గా నియమించబడ్డ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రెండు రోజుల క్రితం బ్రెజిల్ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రియో డి జెనీరో సందడి చేస్తూ గడుపుతున్నాడు. ఈరోజు అదరహో అనిపించేలా ప్రారంభమయిన ఒలింపిక్స్లో ఆయన భారత్ గుడ్విల్ అంబాసిడర్ హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి క్రీస్ట్ ది రిడీమర్ విగ్రహం వద్ద సందడి చేశాడు. ఆ విగ్రహం ముందు ఎలా ఉందో అచ్చం అలాగే నిలబడి, ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తద్వారా ఒలింపిక్స్కి మంచి ప్రచారం చేస్తున్నాడు.