: టౌన్‌హాల్ తరహాలో ప్రజావేదిక.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మోదీ
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన మైగవ్.ఇన్ పోర్టల్ ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ మైదానంలో ప్రధాని మోదీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘టౌన్‌హాల్ తరహాలో ప్రజావేదిక ఏర్పాటు చేసి మోదీ ప్రజలతో మాట్లాడారు. ప్రజల ఆలోచనలతో రూపుదిద్దుకున్న పీఎంవో యాప్ ఆవిష్కరించిన అనంతరం ఆయన.. మైగవ్.ఇన్ పోర్టల్ వెబ్సైట్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. టౌన్‌హాల్ తరహాలో ప్రజలతో మోదీ మాటామంతి జరుపుతున్నారు. కార్యక్రమానికి మైగవ్.ఇన్ పోర్టల్‌లో యాక్టివ్‌గా పొల్గొన్న రెండువేల మంది హాజరయ్యారు.