: ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు!... ఏపీకి ‘హోదా’పై వ్యాఖ్యలే కారణమట!
బీజేపీకి చెందిన ఏపీ నేత, చంద్రబాబు కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పైడికొండల మాణిక్యాలరావుపై కేసు నమోదైంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై విశాఖ జిల్లాకు చెందిన ప్రజాఐక్యవేదిక చేసిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఐక్యవేదిక నేత సురేశ్ బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ వ్యాఖ్యలు చేసిన మాణిక్యాలరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో సురేశ్ బాబు పోలీసులను కోరారు.