: జేఎన్టీయూలో టీ ఎంసెట్-3 కమిటీ భేటీ!... పూర్తిస్థాయి షెడ్యూల్ పై కసరత్తు!
తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంసెట్-3కి సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలకు కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఎంసెట్-3 కమిటీ కూకట్ పల్లిలోని జేఎన్టీయూ కేంపస్ లో కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఈ భేటీకి హాజరయ్యారు. నేటి సాయంత్రానికి ఎంసెట్-3కి సంబంధించి పూర్తి స్థాయిలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.