: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ అలెర్ట్!


శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈనెల 25 వరకు సందర్శకుల పాసుల జారీని నిలిపివేశారు. సీఐఎస్ఎఫ్, ఆక్టోపస్ బృందాలు విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అణువణువూ గాలిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News