: ‘బనేగా స్వచ్ఛ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్లో వ్యక్తిగత పరిశుభ్రతపై డెటాల్ సంస్థ ‘బనేగా స్వచ్ఛ ఇండియా’ పేరిట కార్యక్రమం నిర్వహించింది. దీనిలో తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి ఈరోజు ఉత్సాహంగా పాల్గొన్నారు. డెటాల్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డెటాల్ సంస్థ నిర్వహిస్తోన్న కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాల్లో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.