: రెస్టారెంటులో వెయిటర్ గా పనిచేస్తున్న ఒబామా చిన్న కూతురు!


తన ప్రస్తుత వయసులో సగ భాగాన్ని అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ లో గడిపిన ఒబామా చిన్న కుమార్తె సాషా ఒబామా ఇప్పుడు ఓ పార్ట్ టైం జాబ్ లో చేరింది. ప్రస్తుతం 15 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె, తన తండ్రి వైట్ హౌస్ ను వీడాల్సి వచ్చిన సమయం దగ్గర పడిన వేళ, జీవన గమనానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రైడ్ సీ ఫుడ్, మిల్క్ షేక్ లకు పేరున్న 'నాన్సీ' అనే రెస్టారెంటులో పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది సాషా. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆమె, అది పూర్తయిన తరువాత మీడియా రంగంలో స్థిరపడాలన్నది తన కోరికని సాషా గతంలోనే చెప్పింది. బ్లూ షర్టు, ఖాకీ బ్యాంక్స్ వేసుకుని తలపై టోపీతో కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటుంటే, ఈ విషయం హాట్ టాపిక్ అయి, రెస్టారెంటుకు వస్తున్న కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆమెకు భద్రతగా ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు అక్కడే ఉంటుండటంతో, తొలుత ఆశ్చర్యపోయిన మిగతా వెయిటర్లు, ఆమె ఎవరన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారట. కాగా, నాన్సీ రెస్టారెంట్ యజమాని ఒబామాకు మంచి స్నేహితుడని, అందువల్లే ఆమె ఇక్కడ చేరిందని సమాచారం.

  • Loading...

More Telugu News