: రన్ వేను దాటుకుంటూ రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం.. తప్పిన ప్రమాదం
ఓ విమానం రోడ్డుపైకి దూసుకువచ్చిన ఘటన ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. రన్ వేను దాటి విమానం ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ఆ రోడ్డుపై వెళుతోన్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఘటనలో విమాన సిబ్బందితో పాటు ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయంలో ప్యారిస్ నుంచి వస్తోన్న విమానం ల్యాండవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టుని కొన్నిగంటల పాటు మూసేసిన అధికారులు అనంతరం తిరిగి తెరిచారు.