: ప్రధానిగా నేను హామీలిచ్చాను... మీరు అమలు చేయాలి: మన్మోహన్ సింగ్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తూ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ, ఆనాడు ప్రధాని హోదాలో విభజన బిల్లును ఆమోదిస్తున్న వేళ, తాను ఆరు హామీలను ఇచ్చానని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వం చట్టసభల్లో ప్రకటించిన హామీలను నేటి ప్రభుత్వం విమర్శించడం తగదని, దీనివల్ల పార్లమెంటుపై ప్రజలకున్న నమ్మకం పోతుందని అన్నారు. వెంటనే బీజేపీ తానిచ్చిన ఆరు హామీలనూ నెరవేర్చాలని, ఏపీకి హోదాను ఇవ్వాలని కోరారు. తాను హామీలు ఇస్తున్న వేళ, నేటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా సభలో ఉన్నారని తెలిపారు. సభ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసి, సభ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.

  • Loading...

More Telugu News