: కృష్ణా పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు: విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్
ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర సీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యాధునిక సాంకేతికతతో భద్రత, నిఘా పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. రద్దీ అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని, పుష్కరాల్లో 19 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారన్నారు. పుష్కరాలకు 17,500 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, అదనపు బలగాలు కావాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. పుష్కర ఘాట్ల వద్ద 1300 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.