: టీడీపీ ఏపీ చీఫ్ తో దేవినేని నెహ్రూ భేటీ!... కొడుకుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ సీనియర్!


రాష్ట్రాన్ని నిట్టనిలువునా విభజించిన కాంగ్రెస్ కు ఏపీలో మరో భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే గడచిన ఎన్నికల్లో ఆ పార్టీకి ఏపీలో సింగిల్ సీటు కూడా దక్కలేదు. తాజాగా కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. తనతో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడు దేవినేని అవినాశ్ ను కూడా వెంటబెట్టుకుని టీడీపీలో చేరిపోతున్నారు. ఈ మేరకు నిన్న టీడీపీ ఏపీ చీఫ్ కిమిడి కళా వెంకట్రావుతో దేవినేని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాలు ముగిసిన వెంటనే దేవినేని టీడీపీ ఎంట్రీకి వారిద్దరూ ముహూర్తం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News