: రాజ్యసభలో మరోమారు కేవీపీ బిల్లు ప్రస్తావన!... ఓటింగే డౌటంటున్న విశ్లేషణలు!


ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు నేడు మరోమారు రాజ్యసభలో ప్రస్తావనకు రానుంది. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఏపీలోని మిగిలిన పార్టీల మద్దతుతో పాటు పలు జాతీయ పార్టీల మధ్దతు కూడా లభించింది. ఇప్పటికే మూడు దఫాలుగా రాజ్యసభలో చర్చకు వచ్చిన ఈ బిల్లు సభా కార్యకలాపాలను స్తంభింపజేసింది. పెద్ద సంఖ్యలో ఎంపీలు ఈ బిల్లుపై మాట్లాడగా, వాటన్నింటికీ సమాధానం చెప్పిన సందర్భంగా... ఏపీకి ప్రత్యేక హోదా ఇఛ్చేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కుండబద్దలు కొట్టారు. వెరసి ఈ బిల్లుపై అటు విపక్షాలతో పాటు ఇటు అధికార పక్షం వాదన కూడా పూర్తయింది. అంటే ఈ బిల్లుపై చర్చ ముగిసినట్లే! ఇక కేవీపీ బిల్లుపై ఓటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రాజ్యసభలో మనీ బిల్లు కిందకు రాని బిల్లులపై మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. కేవీపీ బిల్లును కేంద్ర ప్రభుత్వం మనీ బిల్లుగానే పరిగణస్తోంది. వెరసి ఈ బిల్లుపై ఓటింగ్ ను అడ్డుకునే క్రమంలో కేంద్రం... కేవీపీ బిల్లును నేడు మనీ బిల్లుగానే ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News