: ప్రైవేటు మెంబర్ బిల్లు కోసం కాంగ్రెస్ రెండు సార్లు విప్ ఇచ్చింది, మాకు అన్యాయం చేయొద్దు: రఘువీరా
ప్రత్యేక హోదా ఆంధ్రహక్కు పేరిట ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహిస్తోన్న సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమావేశం అర్థవంతంగా ముగిసిందని వ్యాఖ్యానించారు. కేవీపీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు వస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ విప్ ఇచ్చిందని అన్నారు. తమ పార్టీ ఏపీకి హోదా కోసం ఇప్పటికి రెండు సార్లు విప్ ఇచ్చిందని పేర్కొన్నారు. రేపు బిల్లు విషయంలో తమకు అన్యాయం చేయొద్దని, అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ కాపాడుతుందని ఆయన చెప్పారు.