: ఇండియా నుంచి దుబాయ్‌కి వెళ్లే ప‌లు విమానాలు ర‌ద్దు.. వేలాది మంది భార‌తీయుల ఇబ్బందులు


తిరువనంతపురం-దుబాయ్ ఎమిరేట్స్ విమానంలో పొగలు రావడంతో నిన్న దుబాయ్‌లో ఆ విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ అయిన విష‌యం తెలిసిందే. ప్రమాదం బారి నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. నిన్న‌టి విమాన‌ ప్ర‌మాదం నేపథ్యంలో ఇండియా నుంచి దుబాయ్‌కి వెళ్లే ప‌లు విమానాలను దుబాయ్ ర‌ద్దు చేసింది. దీంతో దుబాయ్‌కి వెళ్లాల్సిన వేలాది మంది భారతీయులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌లువురు భార‌తీయులు విమానాశ్ర‌య ప్రాంతాల్లోనే వేచి ఉంటున్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News