: మున్నాభాయ్ కు ఇకపై అన్నీ కలిసొస్తాయని చెప్పిన జ్యోతిష్కుడు


మున్నాభాయ్ సంజయ్ దత్ కు ఇకపై అన్నీ కలిసొస్తాయని, అదృష్టం బాగుందని, భవిష్యత్తులో వెనుదిరిగి చూసే పని లేదని ప్రముఖ జ్యోతిష్కుడు జితేంద్ర పటేల్ చెప్పారుట. ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంజయ్ దత్ తన ఇంటికి జ్యోతిష్కుడిని పిలిపించుకుని తన భవిష్యత్ గురించి చెప్పమన్నాడట. ఫుడ్, హోటల్ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు ఆయనకు బాగా కలిసొస్తాయని, ఇక నుంచీ అన్నీ అనుకూలంగా జరుగుతాయని చెప్పారట. సంజయ్ దత్ భార్య మాన్యత వల్ల ఆయనకు బాగా కలిసొస్తుందని, ఆమె పేరుతోనే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలని కూడా చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, భార్య మాన్యత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తులో అనారోగ్యం సమస్యలు తలెత్తే అవకాశముందని కూడా ఆ జ్యోతిష్కుడు సూచించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News